Bhimavaram: భీమవరం ఎస్సార్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ!
Bhimavaram: భీమవరం ఎస్సార్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ క్యాడేట్లు ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఎంపిక. ఘనంగా సత్కరించిన కళాశాల యాజమాన్యం.
Bhimavaram: భీమవరం ఎస్సార్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ!
Bhimavaram: ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్ కు భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగానికి చెందిన ఇద్దరు క్యాడేట్స్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి మురళీకృష్ణం రాజు చెప్పారు. ఎంపికైన వారిలో సీనియర్ అండ్ ఆఫీసర్ ముల్లు శ్రీను, జూనియర్ అండర్ ఆఫీసర్ మురారి ఊహ ఎంపికైనట్లు చెప్పారు.
వీరితోపాటు రిజర్వ్ క్యాడెట్ గా గనివిడ మణికంఠ ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరఫున ప్రీ రిపబ్లిక్ పెరేడ్కు ఎంపికైన క్యాడేట్స్ ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి మురళీకృష్ణమరాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కే ఎన్ వి సత్యనారాయణ మాట్లాడుతూ జేఎన్టీయూకే పరిధిలో 110 ఎన్ఎస్ఎస్ యూనిట్లు కు సంబంధించి 45 మంది క్యాడేట్స్ ను ప్రాథమిక పరిశీలనకు ఎంపిక చేసి కాకినాడలో నిర్వహించిన క్యాంపులొ వారందరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన క్యాడేట్స్ మాత్రమే ఎంపికయ్యారన్నారు.
ఎంపికైన క్యాడిట్స్ నవంబర్ 10 నుండి 19 వరకు హైదరాబాద్ అనురాగ్ విశ్వవిద్యాలయంలో జరిగే వెస్ట్ జోన్ క్యాంపునకు హాజరు కావలసి ఉందన్నారు. ఇది కళాశాలకు ఎంతో గౌరవప్రదమైన అవకాశం అని ఆయన పేర్కొన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర,గోవా, గుజరాత్, డామన్ అండ్ డయ్యు , దాద్రా నగర్ హైవేలి నుండి ఎంపికైన క్యాడేట్స్ కు హైదరాబాదులో శిక్షణ ఉంటుందన్నారు.
అక్కడ కూడా ప్రతిభ కనపరిచి ఎంపికైన క్యాడెక్స్ ను వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ లో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపిక చేస్తారని చెప్పారు. ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్ కి ఎంపికైన విద్యార్థులను కళాశాల అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి రామకృష్ణ నిషాంత వర్మలు ప్రత్యేకంగా అభినందించారు.




