Godavari: గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: శైలజ రామయ్యర్!
Godavari: పుష్కరాల పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆదేశించారు. భద్రాచలంలో వైకుంఠధామానికి ప్రత్యేక మార్గం ఏర్పాటుపై చర్చ.
Godavari: గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: శైలజ రామయ్యర్!
Godavari: గోదావరి పుష్కరాల నిర్వహణకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, భూసేకరణ, నిధుల విడుదల, టెండర్ల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి తీర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుష్కరాల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, టెండర్ల ప్రక్రియలో పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, టెండర్లు పూర్తయిన నీటిపారుదల పనులను ప్రారంభించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఇంకా ప్రారంభం కాని పనులను క్షేత్రస్థాయిలో చేపట్టాలని సూచించారు. నీటిమట్టాలు తగ్గిన అనంతరం చేపట్టాల్సిన పనులను నవంబర్‌లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
పుష్కర ఘాట్ల పొడవు, విస్తరణపై జిల్లాల అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, కలెక్టర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని శైలజ రామయ్యర్ స్పష్టం చేశారు. అదనపు నిధుల ప్రతిపాదనపై క్యాబినెట్ సబ్‌కమిటీకి నోట్ పంపడంతో పాటు, అత్యవసర పనులకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించాలని సూచించారు.
భద్రాచలంలో పుష్కర ఘాట్లు, వైకుంఠధామానికి ప్రస్తుతం ఒకే మార్గం ఉండటంతో రద్దీ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వైకుంఠధామానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను తరలించేందుకు అనువైన ఏర్పాట్లు అవసరమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సునీత, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




