Palakollu: పాలకొల్లు ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం
Palakollu: పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పెచ్చులు ఊడుతున్న స్లాబ్‌లతో రోగులు భయాందోళన చెందుతున్నారని, నూతన భవనంలోకి మార్చాలని సీపీఎం నేత రవి డిమాండ్ చేశారు.
Palakollu: పాలకొల్లు ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం
Palakollu: పాలకొల్లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు ఎ. రవి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను సిపిఎం పార్టీ బృందం పరిశీలించుట జరిగింది.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ హాస్పటల్ ఇన్ పేషెంట్లు ఉండే వార్డులు కానీ ఇతర విభాగాలు కానీ స్లాబ్ పెచ్చులు ఊడిపోవుట మరియు వైరింగ్ పాతది ఆగుట వలన లైట్లు వెలుగక ఫ్యాన్లు తిరగక ఇబ్బంది పడుతూ పై పిచ్చులు ఎప్పుడు ఊడి మా మీద పడతాయఅని భయాందోళనలో పేషెంట్లు ఉన్నారనీ బాతురూములు కూడా చాలా అశుభ్రంగా ఉన్నాయి.
ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ సమస్యపై ఆందోళన చెంది చర్యలు తీసుకునే కంటే ప్రమాదం జరగకముందే ఇప్పటికే పూర్తయినటు వంటి ఆసుపత్రి కొత్త భవనంలోనికి పేషెంట్లను మార్చినట్లయితే సమస్య ఉండదని అధికారులకు ప్రజాప్రతి నిధులకు చూసిన చేసారు.
స్పందించకుంటే పేషెంట్లతో కలసి ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బాతి రెడ్డి జార్జి, చల్లా సోమేశ్వరరావు, ఏ శ్యామల రాణి, బాసిన శ్యామల, సత్తెమ శెట్టి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.




