Tanuku: తణుకులో మూడు మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎక్సైజ్ పరిధిలో మిగిలిన మూడు మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్ జారీ చేశారు.
Tanuku: తణుకులో మూడు మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్!
Tanuku: తణుకు ప్రొహిబిషన్,ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో మొదటి విడత భర్తీ కాకుండా మిగిలిన మూడు మద్యం దుకాణాలకు ప్రభుత్వం రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసిందని ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. వీటిలో పెనుగొండ మండలంలో రెండు, పెనుమంట్ర మండలంలో ఒకటి ఉందని వెల్లడించారు.
ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గడువు విధించిందని ఆసక్తిగలవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 21న జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి లైసెన్స్లు కేటాయిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు https://oc.hpfsproject.com,తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ 9490874538 నంబర్ సంప్రదించాలని కోరారు.




