Palakollu: ఉచిత కృత్రిమ కాళ్ల స్క్రీనింగ్ క్యాంప్.. రోటరీ క్లబ్ సన్‌రైజ్ చొరవ!
Palakollu: బీఆర్‌ఎంవీఎంహెచ్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్‌రైజ్ ఆధ్వర్యంలో 100 మందికి ఉచిత కృత్రిమ కాళ్ల ఎంపిక స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు.
Palakollu: ఉచిత కృత్రిమ కాళ్ల స్క్రీనింగ్ క్యాంప్.. రోటరీ క్లబ్ సన్‌రైజ్ చొరవ!
పాలకొల్లు: ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్ రైజ్ ఆధ్వర్యంలో పాలకొల్లు BRMVMH స్కూల్ నందు ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన మరియు షుగర్ వ్యాధి వల్ల కాలు తీసేసిన వారికి ఉచితముగా 100 మందికి కాళ్లు పెట్టడం కోసం స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం అయింది.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాలకొల్లు సన్రైస్ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ చవాకుల సూర్య నరేష్ బాబు ,ప్రెసిడెంట్ మాజేటీ సూర్యనారాయణ (రాజా) గారు, ట్రెజరర్ శ్రీకాంత్ పాటిల్ గారు,సిరిగినీడి రాంబాబు గారు, జోగాని సింహాచలం గారు,మండల ప్రసాద్ గారు, వంగా నరసింహారావు గారు, కోళ్ల రమేష్ గారు ధోని సత్యనారాయణ గారు, రోటరీ ఖమ్మం ట్రస్ట్ సెక్రటరీ సాంబశివరావు గారు తదితరులు పాల్గొన్నారు.




