Nidadavole: యర్రకాలువ వరద పరిస్థితిని పరిశీలించిన ఆర్డీఓ ఆనందరావు!
Nidadavole: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వర్షపు నీటి ప్రభావిత ప్రాంతాలు, యర్రకాలువ వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కొవ్వూరు ఆర్డీఓ కే. ఆనందరావు.
Nidadavole: యర్రకాలువ వరద పరిస్థితిని పరిశీలించిన ఆర్డీఓ ఆనందరావు!
Nidadavole: భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వర్షపు నీటితో ప్రభావితమైన ప్రాంతాలను కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ఆనందరావు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామంలో నెలకొన్న పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో, క్షేత్ర స్థాయి సిబ్బంది తో ఆయన సమీక్షించారు.
అనంతరం నిడదవోలు మండల పరిధిలో యర్రకాలువ వరద పరిస్థితిని ఆర్డీఓ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కాలువలో పెరిగిన నీటిమట్టం, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో నిడదవోలు తహసీల్దార్ బి. నాగరాజు నాయక్‌తో పాటు నీటిపారుదల, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




