Narsapuram: నరసాపురం వైస్ ఎంపీపీగా రావూరి సురేష్ కుమార్ ప్రమాణం!
Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆర్వో డాక్టర్ జి. సునీత ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీగా రావూరి సురేష్ కుమార్ ప్రమాణం చేశారు.
Narsapuram: నరసాపురం వైస్ ఎంపీపీగా రావూరి సురేష్ కుమార్ ప్రమాణం!
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసాపురం వైస్ ఎంపీపీగా రావూరి సురేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రిటర్నింగ్ అధికారి డాక్టర్ జి. సునీత ఆయనతో పాటు ఎంపీటీసీ, కో-ఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ హాజరై నూతన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించి సత్కరించారు.




