Penumantra: పెనుమంట్రలో ‘పోషణ్ భీ - పఢాయీ భీ’ శిక్షణ ముగింపు
Penumantra: పెనుమంట్రలో ‘పోషణ్ భీ - పఢాయీ భీ’ అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ ముగిసింది. అంగన్వాడీ కేంద్రమే పిల్లల తొలి బడి అని సీడీపీఓ కృష్ణకుమారి స్పష్టం చేశారు.
Penumantra: పెనుమంట్రలో ‘పోషణ్ భీ - పఢాయీ భీ’ శిక్షణ ముగింపు
పెనుమంట్ర: పెనుమంట్ర ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని పెనుమంట్ర మండల అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న "పోషణ్ భీ - పఢాయీ భీ" శిక్షణా కార్యక్రమం చివరి రోజు ఘనంగా ముగిసింది.
ఈ శిక్షణలో భాగంగా 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పోషకాహారంతో పాటు ప్రాథమిక విద్యను ఎలా అందించాలో కార్యకర్తలకు వివరంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలకు అక్షరాలు, సంఖ్యలు, రంగులు, ఆకారాలు, పాటలు, ఆటల ద్వారా నేర్పించే విధానం, కథలు చెప్పడం, బొమ్మల ద్వారా బోధన గురించి శిక్షకులు వివరించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ అంగర కృష్ణకుమారి మాట్లాడుతూ... "అంగన్వాడీ కేంద్రమే పిల్లల తొలి బడి. కార్యకర్తలు నేర్చుకున్న అంశాలను తమ కేంద్రాల్లో ప్రతిరోజూ పిల్లలకు ఆటల ద్వారా నేర్పించాలి. పోషణతో పాటు చదువు కూడా ముఖ్యమే" అని సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో సూపర్వైజర్లు వరలక్ష్మి, రూతు కుమారి ,సూర్య కుమారి పెనుమంట్ర మండలం పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.




