Poduru: పోడూరులో మెదడు వ్యాధి బాధితురాలికి వసుధా ఫౌండేషన్ ఆర్థిక భరోసా

Poduru: పోడూరు గ్రామానికి చెందిన అనారోగ్య బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 11 Oct 2026 8:55 PM IST
Poduru
X

Poduru: పోడూరులో మెదడు వ్యాధి బాధితురాలికి వసుధా ఫౌండేషన్ ఆర్థిక భరోసా

పోడూరు: పోడూరు గ్రామానికి చెందిన సప్పరపు నాగదుర్గ (30) కొంతకాలంగా మెదడు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వారిది పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు ఎంతో భారంగా మారాయి.

పాలకొల్లు క్షత్రియ పరిషత్ అధ్యక్షులు చేకూరి సూరిబాబు నాగదుర్గ పరిస్థితిని వసుధ ఫౌండేషన్ కన్వీనర్ పెనుమత్స బుద్ధరాజు ద్వారా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మానవతా హృదయంతో స్పందించి నాగ దుర్గ వైద్య ఖర్చులకోసం ఫౌండేషన్ ద్వారా రూ.10,000 ఆర్థిక సాయం మంజూరు చేశారు.

వసుధ ఫౌండేషన్ నుంచి మంజూరైన చెక్కును పోడూరులో పాలకొల్లు క్షత్రియ పరిషత్ అధ్యక్షులు చేకూరి సూరిబాబు ఆదివారం నాగదుర్గ భర్త మల్లేశ్వరరావుకు అందజేశారు.

ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ "మానవసేవయే మాధవ సేవ" అన్న నానుడిని స్ఫూర్తిగా తీసుకొని అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులకి ఇబ్బందులు పడుతున్న వారికి వసుధ ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రామరాజు ఆర్థికంగా సహాయం అందించటం ఎంతో అభినందనీయమన్నారు. సూరిబాబు, నాగదుర్గ భర్త మల్లేశ్వరరావు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వసుధ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA