Poduru: పోడూరులో 14వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షలు!
Poduru: పోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట 14వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష వినూత్నంగా వంటావార్పు నిరసన పే స్కేల్, ప్రమోషన్లు అమలు చేయాలని డిమాండ్.
Poduru: పోడూరులో 14వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షలు!
పోడూరు: పోడూరు, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా పోడూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు 14వ రోజు మంగళవారం వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బెల్లాని ప్రకాష్ రావు.
ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలనీ, అర్హులైన వీఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలనీ, రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లన్నీ పరిష్కరించాలన్నారు.




