Poduru: గుమ్ములూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ
Poduru: గుమ్ములూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని హెచ్చరిక.
Poduru: గుమ్ములూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ
పోడూరు: బుధవారం పోడూరు మండలం గుమ్ములూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకము తనిఖీ నిర్వహించిన మండల తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ హై స్కూల్లో మొత్తం 286 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా ఈరోజు 177 విద్యార్థిని విద్యార్థులు స్కూలుకు హాజరై మధ్యాహ్న భోజనము తీసుకుని ఉన్నారు.
మెనూ ప్రకారం బుధవారం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మరియు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వవలసి ఉండగా, ఎగ్ ఫ్రైడ్ రైస్ వడ్డించి ఉన్నారు. అది కూడా రుచికరముగా లేదు.ఇకపై మెనూ ప్రకారమే ఆహారము తయారు చేయవలసిందిగా మరింత రుచికరంగా తయారు చేయవలసిందిగా ఏజెన్సీ వారిని / స్కూలు యాజమాన్యం వారిని తహసిల్దార్ హెచ్చరించడం అయినది..




