Poduru: జిన్నూరు మోడల్ స్కూల్‌కు దాత పెనుమత్స రమణ ప్రసాదరాజు వితరణ

Poduru: జిన్నూరు మోడల్ స్కూల్ అభివృద్ధికి రూ.1.5 లక్షలతో మరమ్మతులు చేపట్టిన దాత రమణ ప్రసాదరాజు. నేపాల్ వరద బాధితులకు కూడా ఆర్థిక సాయం అందజేత.

S VENKAT, PALAKOLLU
Published on: 26 Sept 2026 8:30 PM IST
Poduru
X

Poduru: జిన్నూరు మోడల్ స్కూల్‌కు దాత పెనుమత్స రమణ ప్రసాదరాజు వితరణ

పోడూరు: పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని మెయిన్ మోడల్ స్కూలుకు గ్రామ ప్రముఖులు, మానవతామూర్తి పెనుమత్స రమణ ప్రసాద్ రాజు 1.5 లక్షల సొంత ఖర్చులతో స్కూల్ భవనం తలుపులు, కిటికీలకు మరమ్మత్తులు చేయించి వాటికి నూతన రంగులు చేయించారు. పూర్తిగా పాడైన వాటి స్థానంలో కొత్త తలుపులు, కొత్త కిటికీలు చేయించారు. దీంతో మోడల్ పాఠశాల భవనం నూతన హంగులతో రూపు దిద్దుకొంటోంది.

రమణ ప్రసాద్ రాజు హైదరాబాదులో స్థిరపడినప్పటికీ సొంత ఊరైన జిన్నూరు లో తమ చిన్నతనంలో చదువుకున్న స్కూలు అభివృద్ధికి నిరంతరం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. త్వరలో పాఠశాల భవనానికి నూతన రంగులు కూడా వేయిస్తానని దాత రమణ ప్రసాద్రాజు హామీ ఇవ్వడంతో స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాత రమణప్రసాద్ రాజు గతంలో జిన్నూరు మోడల్ స్కూల్ కు కంప్యూటర్, ప్రింటర్ బహుకరించారు. అలాగే సొంత ఖర్చులతో పాఠశాల భవనానికి విద్యుత్ మరమ్మత్తు పనులు చేయించారు.

విద్యార్థులందరికీ ప్రముఖ ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా మెడికల్ టెస్ట్ లు చేయించి బ్లడ్ గ్రూప్ సర్టిఫికెట్లు ఇప్పించారు. మంచి శ్రేయోభిలాషిగా, మనసున్న మారాజు వలె ఎంత ఖర్చైనా వెనకాడకుండా జిన్నూరు మోడల్ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి మానవతా హృదయంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాత రమణ ప్రసాద్ రాజుకు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

నేపాల్ వరద బాధితులకు రూ.5వేల విరాళం

అలాగే నేపాల్ వరద బాధితుల సహాయార్థం, టెనా అధ్యక్షులు శ్రీ ఈశ్వర్ రమణ ద్వారా విరాళంగా రూ.5వేల చెక్కును ఢిల్లీలోని నేపాల్ రాయబారి కార్యాలయ అధికారులకు అందజేయడం ద్వారా రమణ ప్రసాద్ రాజు తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. సొంత గ్రామంలోని విద్యార్థుల కోసం, ప్రజల కోసమే కాకుండా నేపాల్ వంటి విదేశాల్లోని వరద బాధితులకు సహృదయంతో ఆర్దికసాయం అందించడం పట్ల గ్రామ ప్రజలు, మానవతా మూర్తులు దాత రమణ ప్రసాద్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

“సేవే లక్ష్యం” అనే స్ఫూర్తితో రమణ ప్రసాద్ రాజు తన తండ్రి గారి పేరున నిర్వహిస్తున్న రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 28 ఏళ్లుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రస్ట్ ద్వారా ప్రతీ ఏటా ₹4–6 లక్షల ఖర్చుతో అవసరంలో ఉన్నవారికి అన్నదానం, విద్యా సహాయం, వైద్య సహాయం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU