Poduru: కవిటం ఉత్తరపేటలో రోడ్లు, డ్రైనేజీల కోసం ధర్నా!
Poduru: కవిటం ఉత్తరపేటలో 15 ఏళ్లుగా రోడ్లు, డ్రైనేజీల్లేక నరకయాతన: రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలని సీపీఎం నేత కేతా గోపాలన్ డిమాండ్.
Poduru: కవిటం ఉత్తరపేటలో రోడ్లు, డ్రైనేజీల కోసం ధర్నా!
పోడూరు: కవిటం ఉత్తరపేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ డిమాండ్ చేసారు. పోడూరు మండలం కవిటం ఉత్తరపేటలో ఆదివారం కాలనివాసులు ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. స్కూల్ కి ఎలా వెళ్లాలని చిన్నపిల్లలు రోడ్డు పై బయటాయించి నిరసన్లు తెలిపారు.
ఈసందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు కాలనిలో సీసీ రోడ్లు, డ్రైనేజి లు ఏర్పాటు చేయలేదన్నారు. స్కూల్ పిల్లలు స్కూలుకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. త్రాగు నీరు గాని, రోడ్లు, డ్రైనేజి లు ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు.
వర్షం వస్తే మోకాలు లోతు నీరు ఉండడంతో కాలనివాసులు ఇబ్బందులకు గురవు తున్నారన్నారు. ఎస్సి కాలనిలో సబ్ ప్లాన్ నిధులు విడుదలచేసి వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో పార్టీ పోడూరు మండల కన్వీనర్ కె వెంకటేశ్వర్లు, ఠాగూర్, బోష్, కోట చిట్టిబాబు, ఇంజెటీ వెంకటేష్, కిషోర్,చింతాడ దొరబాబు, దిండే రామకృష్ణ, నక్క కొండలరావు, మట్టా రాజు, నర్సయ్య, అనంత, సిర్రా నరసింహామూర్తి, సరమండ అనంత, సిర్రా సావిత్రి తదితరులు పాల్గొన్నారు.




