Poduru: పోడూరు మండలం మట్టపర్రు ఆలయ అభివృద్ధికి ధర్మారావు ఫౌండేషన్ సాయం

Poduru: పోడూరు మండలం మట్టపర్రు చిన్నపాలెం ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా 40 సిమెంట్ బస్తాలను అందజేశారు.

S VENKAT, PALAKOLLU
Published on: 29 Sept 2026 10:07 PM IST
Poduru
X

Poduru: పోడూరు మండలం మట్టపర్రు ఆలయ అభివృద్ధికి ధర్మారావు ఫౌండేషన్ సాయం

పోడూరు: పోడూరు మండలం మట్టపర్రు గ్రామం చిన్నపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ధర్మారావు ఫౌండేషన్ అండగా నిలిచింది. ఆలయ నిర్మాణ పనులకు అవసరమైన 40 సిమెంట్ బస్తాలను ఫౌండేషన్ ద్వారా అందజేశారు.

ఆలయ నిర్వాహకులు ఇటీవల ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి ఆలయానికి సహాయం చేయాలని కోరగా వారి విజ్ఞప్తికి స్పందించిన మంత్రి రామానాయుడు, ధర్మారావు ఫౌండేషన్ సభ్యుల ద్వారా సిమెంట్ బస్తాలను అందజేయించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి స్పందించి 40 సిమెంట్ బస్తాలను అందించిన మంత్రి నిమ్మల రామానాయుడుకు, ధర్మారావు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ఫౌండేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU