Poduru: పాఠశాలల్లో నులిపురుగుల నివారణ దినోత్సవం

Poduru: పోడూరు మండలంలో నులిపురుగుల నివారణ దినోత్సవం. విద్యార్థులకు అల్బెండోజోల్ మాత్రల పంపిణీపై అధికారుల సమన్వయ సమావేశం.

E.ABRAHAM, ACHANTA
Published on: 23 Sept 2026 5:55 PM IST
Poduru
X

Poduru: పాఠశాలల్లో నులిపురుగుల నివారణ దినోత్సవం

పోడూరు: పోడూరు మండలం లోని ప్రతి పాఠశాల లో నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అల్బెండోజోల్ మాత్రలు ప్రతి విద్యార్థిని విద్యార్దులు కు మింగించాలని పోడూరు మండలం మండల పరిషత్ అధికారిబి యల్ మంగ కుమారి తెలిపారు.

పోడూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వారు ఏర్పాటు చేసిన శాఖలు సమన్వయ సమావేశం లో మాట్లాడుతూ, విద్యా శాఖ అంగన్వాడీ వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ్ శాఖ లు సమన్వయం తో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు.

వైద్యాధికారి ఎస్ శ్రీ వాసవి మాట్లాడుతూ పోడూరు మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిథి ముందు రోజు విద్యార్థులు తల్లితండ్రులు కు సమాచారం ఇచ్చి ఆల్బెండ్జోల్ మాత్రలు ఇచ్చే రోజు అసెంబ్లీ లో విద్యార్దులు కు తెలిపి మధ్యాహ్నం భోజనం అయిన పిదప మాత్రలు మింగించాలి అని తెలిపారు చేతులు పరిశుభ్రత కొరకు సిబ్బంది ప్రదర్శన చేసి చూపించాలి అని తెలిపారు

ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారి 2 జి వి సూర్యనారాయణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె బి కె ఎస్ రమేష్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారి జె సత్యనారాయణ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA