Poduru: పండితవిల్లూరులో 1215 మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ!
Poduru: పోడూరు మండలం పండితవిల్లూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చేతుల మీదుగా 1215 మంది రైతులకు రాజముద్ర పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ.
Poduru: పండితవిల్లూరులో 1215 మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ!
Poduru: పోడూరు మండలంలోని పండిత విల్లూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా
పండిత విల్లూరు తూర్పు పాలెం గ్రామాల 1215 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. భూ రికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన సేవలను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతుల భూ యాజమాన్యానికి అధికారిక గుర్తింపుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్, మండల రెవెన్యూ అధికారి కందుల రాంబాబు, గ్రామ కార్యదర్శి వెంకటలక్ష్మి,వీఆర్వో కుమార్, మాజీ సర్పంచ్. మండల టిడిపి అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు, రుద్ర రాజు రవిరాజు. గ్రామ టిడిపి సీనియర్ నాయకులు గణపతి నీడి రాంబాబు,తమనంపూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామటిడిపి అధ్యక్షులు నామాల శ్రీను వీఆర్వోలు సచివాలయ సిబ్బంది, రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు.




