Penumantra: ఈ నెల 26న తొలి దశ పంచాయతీ ఎన్నికలు: ఎంపీడీవో
Penumantra: ఈ నెల 26న పెనుమంట్ర మండలంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎంపీడీవో చింత కూర్మా వెంకట రెడ్డి ప్రకటించారు.
Penumantra: ఈ నెల 26న తొలి దశ పంచాయతీ ఎన్నికలు: ఎంపీడీవో
పెనుమంట్ర: పెనుమంట్ర మండలాన్ని తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేర్చినట్లు ఎంపీడీవో చింత కూర్మా వెంకట రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు.
ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 15న ఎన్నికల అధికారి నోటీసు జారీ చేస్తారు. 17వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. 18న నామినేషన్ల పరిశీలన, 19న అప్పీళ్ల స్వీకరణ, 20న వాటి పరిష్కారం చేపడతారు. 21న అభ్యర్థిత్వ ఉపసంహరణతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
26న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేపడతారు. అవసరమైతే 27న రీపోలింగ్ నిర్వహిస్తారు. పరోక్ష ఎన్నికలకు సంబంధించి 13న నోటిఫికేషన్ విడుదల చేసి, 26న సభ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. 26, 27 తేదీల్లో ప్రత్యేక సమావేశాల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు.
మండల పరిధిలోని ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు ఎన్నికల షెడ్యూల్‌ను గమనించి, నిర్ణీత గడువులోగా నామినేషన్లు తదితర ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించారు.




