Tanuku: పెరవలిలో సన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Tanuku: తణుకు సన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెరవలిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 200 మంది పేదలకు డాక్టర్ శోభా శరణ్ ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.
Tanuku: పెరవలిలో సన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Tanuku: ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శోభా శరణ్ అన్నారు. తణుకు సన్ హాస్పటల్ ఆధ్వర్యంలో కల్వరి మై ఫాదర్స్ హోమ్ ట్రస్ట్ సౌజన్యంతో పెరవలిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
శిబిరాలు వల్ల పేదలకు ఎంతో విలువైన వైద్యం అందించడంతో పాటు రోగులకు అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎబినేజర్ పాల్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు సేవ చేయడంతో పాటు, వారికి సహాయం అందించడం కోసం అద్భుతమైన వైద్య శిబిరాన్ని నిర్వహించే అవకాశం ఏర్పడిందన్నారు.
ఈ వైద్య శిబిరానికి తమ విలువైన సహకారం, వైద్య సేవలు అందించిన సన్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభా శరణ్ సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేసి, ఆరోగ్య సంబంధిత సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సన్ ఆస్పత్రి సిబ్బంది, కల్వరి చర్చి సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.




