Penumantra: వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ప్రచారం హోరెత్తించిన వాసురెడ్డి సతీమణి
Penumantra: పెనుమంట్ర మండలం ఇలింద్రపర్రులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కర్రి వెంకట నారాయణరెడ్డి సతీమణి ప్రచారం. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని పిలుపు.
Penumantra: వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ప్రచారం హోరెత్తించిన వాసురెడ్డి సతీమణి
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి కర్రి వెంకట నారాయణరెడ్డి అలియాస్ వాసురెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఆదివారం ఇలింద్రపర్రు గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి సతీమణి ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తూ... ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు మేడపాటి షర్మిల రెడ్డి కూడా పాల్గొని, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి అఖండ మెజారిటీతో పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు




