Penumantra: పెనుమంట్రలో రూ. 25 వేలకు వినాయక లడ్డూ వేలం!

Penumantra: పెనుమంట్ర శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా లడ్డూ వేలం: రూ. 25 వేలకు దక్కించుకున్న అఖిల్ రెడ్డి, కోయ నృత్యాల నడుమ గోస్తా నదిలో వినాయక నిమజ్జనం.

E.ABRAHAM, ACHANTA
Published on: 24 Sept 2026 8:09 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్రలో రూ. 25 వేలకు వినాయక లడ్డూ వేలం!

పెనుమంట్ర: పెనుమంట్ర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో లడ్డు ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహాన్ని 11 రోజులు నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డును జవ్వాది నాగేశ్వరరావు జెసి వారి శిష్యుడు అఖిల్ రెడ్డి స్వామివారి లడ్డును 25 వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు.

లడ్డును పాడుకున్న వారికి లడ్డు దాత చంటి, కమిటీ సభ్యులు భూపతి రాజు రవీంద్ర రాజు వీర వెంకటరెడ్డి అందజేశారు. తదుపరి వరసిద్ధి గణపతి విగ్రహాన్ని భజంత్రీలు మందు గుండు సామాగ్రి తో, కోయ డాన్సులతో ఊరేగింపుగా అంగరంగ వైభవంగా జరిపి గోస్తా నదిలో నిమజ్జనం చేయడం జరిగింది.

విగ్రహ దాత సత్య టెక్నాలజీస్ కర్రి సుబ్బారెడ్డి, లడ్డు దాత తుంపూడి చంటి ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు భూపతిరాజు రవీంద్ర రాజు, నల్లిమిల్లి గోపిరెడ్డి, వీర వెంకటరెడ్డి, తుంపూడి విజయ్, ఐటిఐ రాంబాబు, అరటి కట్ల సత్యనారాయణ, ఇసుకపల్లి రంగరాజు, గోపిరెడ్డి, కర్రీ నాగిరెడ్డి, డి వి డి నరసింహారావు, కిషోర్ బబ్బి, భక్తులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA