Penumantra: పెనుమంట్ర వద్ద రోడ్డు ప్రమాదం: తల్లీకుమారులకు తీవ్ర గాయాలు!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పంపనవారిపాలెం వద్ద బైక్ అదుపుతప్పి పడిన ప్రమాదంలో తల్లీకుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 24 Oct 2026 11:07 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర వద్ద రోడ్డు ప్రమాదం: తల్లీకుమారులకు తీవ్ర గాయాలు!

పెనుమంట్ర: నరసాపురం మండలం మోడీ గ్రామానికి చెందిన గుబ్బల రవి(42) తన తల్లి జయలక్ష్మి(60) ని తీసుకుని మోటార్ సైకిల్ పై ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రానికి వెళుచుండగా పెనుమంట్ర మండలం పంపన వారి పాలెం కోళ్లు ఫారం వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో ఇరువురి తలకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు స్పందించి పెనుమంట్ర 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించగా సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాలకృష్ణ పైలట్ బ్రహ్మాజీ సహకారంతో ఘటన స్థలంలోనే ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కొరకు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA