Penumantra: పెనుమంట్ర ‘మానవత’ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు!

Penumantra: పెనుమంట్ర మానవత సంస్థ ఆధ్వర్యంలో చిన్నారి వైద్యానికి రూ.15 వేల సాయం: నీట్ ర్యాంకర్ సిర్రా అనురాధకు ఘన సన్మానం, మార్టేరులో వైభవంగా నెలవారీ సమావేశం.

E.ABRAHAM, ACHANTA
Published on: 27 Sept 2026 7:38 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర ‘మానవత’ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు!

పెనుమంట్ర: మానవత సంస్థ పెనుమంట్ర శాఖ నెలవారీ సమావేశం ఆదివారం మార్టేరు కార్యాలయంలో మండల అధ్యక్షుడు పడాల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా దాత, సామాజిక సేవకుడు కోనాల వెంకటరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు పోడూరి రామచంద్రరావు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చెందిన చిన్నారి బొక్కా హదాస వైద్య ఖర్చుల కోసం మానవత సభ్యులు, దాతల సహకారంతో రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

అదేవిధంగా పేద కుటుంబంలో జన్మించి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నీట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించి ఉచిత ఎంబీబీఎస్ సీటు పొందిన వెలగలేరు గ్రామానికి చెందిన సిర్రా అనురాధను మానవత సభ్యులు ఘనంగా సన్మానించారు.

అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. మానవత విలువలు, ఉత్తమ సమాజ నిర్మాణం తదితర అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కొత్తసత్యనారాయణమూర్తి, రీజినల్ చైర్మన్ బాణాల శ్రీనివాసరావు, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ చిర్ల శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు కర్రి కృష్ణారెడ్డి, శాశ్వత సభ్యులు డాక్టర్ పోడూరి కృష్ణమూర్తి, వడూరి చలమయ్య, సభ్యులు సీరం విశ్వనాథం, బండి ప్రసాద్, శ్రీనివాసుల మురళీకృష్ణ, ఇంద్రేశ్వర గుప్తా, దొంగ జయదుర్గారావు, చిర్ల వంశీ హరనాథరెడ్డి, పాల ప్రసాద్, పడాల సువర్ణగౌరీ, కోనాల నర్సిరెడ్డి, అమృతవక్కుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA