Penumantra: వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కర్రి వెంకటనారాయణ రెడ్డి
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మాజీ ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి)ని వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అధిష్ఠానం నియమించింది.
Penumantra: వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కర్రి వెంకటనారాయణ రెడ్డి
పెనుమంట్ర: పెనుమంట్ర మండల మాజీ ఎంపీపీ కర్రీ వెంకట నారాయణరెడ్డి (వాసురెడ్డి) ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయనను వైసిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.
తనకు ఈపదవి ఆయనకు లభించినందుకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజుకు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి వాసురెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పెనుమంట్ర ఎంపీపీగా పనిచేసిన వాసురెడ్డికి స్థానికంగా పార్టీ శ్రేణులతో మంచి అనుబంధం ఉందని నాయకులు తెలిపారు. గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేశారని పేర్కొన్నారు.
రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.




