Penumantra: ప్రచారం జోరు.. అభివృద్ధి నిల్: మాజీ జెడ్పీటీసీ గౌరీ సుభాషిణి

Penumantra: కూటమి ప్రభుత్వంలో ప్రచారం జోరుగా ఉన్నా అభివృద్ధి శూన్యమని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల మాజీ జెడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి తీవ్ర విమర్శలు చేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 26 Sept 2026 7:59 PM IST
Penumantra
X

Penumantra: ప్రచారం జోరు.. అభివృద్ధి నిల్: మాజీ జెడ్పీటీసీ గౌరీ సుభాషిణి

Penumantra: పెనుమంట్ర మండల మాజీ జడ్పిటిసి కర్రీ గౌరీ సుభాషిని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పనితీరుని ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం తెదేపా పరిపాలన ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మేనిఫెస్టోలో పెట్టింది ఏమిటి ? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను చేస్తున్నది ఏమిటి. ప్రజలు అర్థం చేసుకోవాలని.తెదేపా, ఇన్ఫ్లు ఇయర్స్ పేరుతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి టీడీపీ కార్యకర్తలకు లబ్ది చేకూరు స్తున్నారని పత్రిక ప్రకటనలు విమర్శించారు.

నియోజవర్గంలో అభివృద్ధి ఎక్కడ మచ్చుకైనా చూపించమనండి. అని ఆవేదన చెందారు పేపర్లు ప్రకటన తప్ప అభివృద్ధి అక్కడ. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి బూటక ప్రసారాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం తమ పార్టీ జాగీర్లకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వసొమ్ము,దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA