Penumantra: పెనుమంట్రలో ఉప్పొంగిన గోస్తాని నది.. నీటమునిగిన రహదారులు, పంటలు

Penumantra: పెనుమంట్ర మండలంలో ఉప్పొంగిన గోస్తాని నది వరద నీరు. సోమరాజు ఇంద్రపర్రు రహదారులపై ప్రవాహం, వందలాది ఎకరాలు నీట ముంపు. గ్రామస్తులకు పెద్దల అన్నదానం.

E.ABRAHAM, ACHANTA
Published on: 9 Nov 2026 7:56 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్రలో ఉప్పొంగిన గోస్తాని నది.. నీటమునిగిన రహదారులు, పంటలు

పెనుమంట్ర: ప్రధాన రహదారులపై వరద నీరుపారుతుంది దీనితో పెనుమంట్ర మండలంలోని సోమరాజుఇంద్రపర్రు, పెనుమంట్ర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులపై గోస్తా నది వరద నీరు పొంగిపొర్లుతోంది.

దీనితో గ్రామానికి రాకపోకలు బంద్ తో పాటు, వరద నీరు రహదారులపై ప్రవహించడంతో గ్రామ ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఇతర గ్రామాల ప్రజలు సోమరాజు ఇంద్రపర్రులోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.

నీట మునిగిన పంట పొలాలు: గ్రామ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల వ్యవసాయ భూములు వరద నీటిలో మునిగిపోయాయి.దీనితో రైతులు ఆందోళన సెందుతున్నారు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న, గ్రామ ప్రజలకు కొందరు గ్రామ పెద్దలు అండగా నిలుస్తున్నారు.

ఉదయం, సాయంత్రం భోజన ఏర్పాట్లతో గ్రామంలో ప్రజల ఆకలి తీర్చేందుకు కొందరు పెద్దలు తమ దాతృత్వంతో ఉదయం, సాయంత్రం భారీ స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA