Penugonda: బీసీలను ప్రభుత్వం మరోసారి వంచించింది

Penugonda: పెనుగొండలో మాజీ జెడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 3 Oct 2026 8:46 PM IST
Penugonda
X

Penugonda: బీసీలను ప్రభుత్వం మరోసారి వంచించింది

పెనుగొండ: బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మరోసారి బీసీలను వంచించిందని మాజీ జెడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి విమర్శించారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

బీసీ కార్పొరేషన్‌కు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని, బీసీల స్వయం ఉపాధి కోసం రూ.10 వేల కోట్లతో ఆర్థిక సహాయం అందిస్తామని, రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకాన్నిపునరుద్ధరిస్తామని ప్రకటించినప్పటికీ వాటి అమలుపై స్పష్టత లేదని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధన ఉన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసినప్పటికీ 34 శాతం బీసీ రిజర్వేషన్లతో జీవో తీసుకురావడం జరిగిందని ఆరోపించారు. ఈ రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

కోర్టు తీర్పును వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏర్పడిన పరిస్థితులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మరల్చేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని కర్రీ గౌరీ సుభాషిణి అన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA