Penugonda: బూరుగులంక గణేష్ లడ్డూ వేలం: రూ.36 వేలకు రాజా కైవసం

Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం బూరుగులంక గణపతి లడ్డూను వేలం పాటలో రూ.36 వేలకు మాజీ ఉపసర్పంచ్ దాసిరెడ్డి రాజా దక్కించుకున్నారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 26 Sept 2026 7:50 PM IST
Penugonda
X

Penugonda: బూరుగులంక గణేష్ లడ్డూ వేలం: రూ.36 వేలకు రాజా కైవసం

పెనుగొండ: చవితి ఉత్సవాలలో శ్రీ విగ్నేశ్వర స్వామి వారి చవితి ఉత్సవాలు అన్ని రోజులు లడ్డు ప్రసాదాన్ని ఉంచి ఉత్సవాల అనంతరం భక్తుల సమక్షంలో వేలంపాట వేయటం పరిపాటి. ఈ లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో భక్తులు పోటీపడి మరీ లడ్డూని సొంతం చేసుకుంటారు.

పెనుగొండ మండలం, సిద్ధాంతం బూరుగులంక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి వేడుకలు ముగియడంతో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని భక్తుల సమక్షంలో వేలం పాట వేయగా సిద్ధాంతం గ్రామ మాజీ ఉపసర్పంచ్ దాసిరెడ్డి రాజా రూ. 36 వేల రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని చేజిక్కించుకున్నారు.

లడ్డు ప్రసాదం అందుకున్న రాజా మాట్లాడుతూ స్వామివారి లడ్డు ప్రసాదం వేలంలో ప్రతి ఏడాది నాకు దక్కడం ఆనందంగా ఉందని, స్వామివారి ఆశీస్సులతోనే ఈ లడ్డు ప్రసాదం దక్కిందని, స్వామివారి ఆశీస్సులు గ్రామస్తులపై ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బూరుగులంక కమిటీ కుర్రోళ్ళు, వరసిద్ధి వినాయక యూత్ సభ్యులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA