Penugonda: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి
Penugonda: పెనుగొండలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
Penugonda: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి
పెనుగొండ: ఎన్నికలు కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణం తొలగించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డిమాండ్ చేశారు.స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో శుక్రవారం జరిగిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల రెన్యువల్లో సర్ పేరుతో జరిగిన అవకతవకల కారణంగా దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగింపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైన తొలగింపులు చట్టవిరుద్ధమని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. మోడీ ప్రభుత్వం తనకు అనుకూలంగా చేసిన ఈ వ్యవహారంలో జ్ఞానేశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు కమిషన్ సభ్యులు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ ఏకపక్షంగా జరగకుండా ఓటర్లకు అవసరమైన సమయం ఇవ్వాలని కోరారు.
ఈ ప్రక్రియలో ఓట్లు నమోదు, తొలగింపు కూడా ఏకపక్షంగా జరగకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎస్. వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు నీలాపు ఆదినారాయణ, గుడిమెట్ల వరహాలు రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కే. ఈశ్వర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.




