Penugonda: పెనుగొండ భాష్యం స్కూల్లో వైభవంగా దసరా వేడుకలు

Penugonda: పెనుగొండ భాష్యం పాఠశాలలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నవదుర్గల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో చిన్నారులు విశేషంగా ఆకట్టుకున్నారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 10 Oct 2026 9:42 PM IST
Penugonda
X

Penugonda: పెనుగొండ భాష్యం స్కూల్లో వైభవంగా దసరా వేడుకలు

పెనుగొండ: పెనుగొండ భాష్యం పాఠశాలలో ఘనంగా జరిగిన దసరా పండుగ వేడుకలు స్థానిక కంబాల వారి వీధిలో గల భాష్యం పాఠశాలలో ది:10-10-2026 శనివారం నాడు విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి దసరా పండుగ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారని ప్రిన్సిపాల్ శ్రీ ఎన్ వి అప్పారావు గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులంతా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు ప్రదర్శించిన నవదుర్గల వేషధారణ అనంతరం ప్రిన్సిపల్ శ్రీ ఎన్. వి అప్పారావు గారు మాట్లాడుతూ చెడు మీద మంచి విజయం సాధించిన ప్రతీకగా దసరా ఉత్సవాల నిలుస్తాయి.

ఈ పండుగను ప్రాంతాలవారీగా విజయదశమి (దసరా), బతుకమ్మ వంటి వివిధ పేర్లతో పిలుస్తారని ఆ చల్లని తల్లి లాలనతో ప్రేమతో కరుణ చూపుతోందని తప్పు చేస్తే కాలికై దండిస్తుందని ఆ చల్లని తల్లి అందర్నీ కరుణతో చూడాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇన్చార్జ్ శ్రీ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి గారు, చాంప్స్ ఇంచార్జ్ శ్రీమతి రాణి రోజాజీ గారు ఉపాధ్యాయ- ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA