Marteru: సెప్టెంబర్ 29, 30 తేదీల్లో పెన్షనర్ల జిల్లా స్థాయి ధర్నాలు
Marteru: పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 29, 30 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని మార్టేరు ఎస్‌జీపీఏ నేతలు కోరారు.
Marteru: సెప్టెంబర్ 29, 30 తేదీల్లో పెన్షనర్ల జిల్లా స్థాయి ధర్నాలు
మార్టేరు: పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 29, 30 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న ధర్నాలను జయప్రదం చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఎస్‌జీపీఏ) మార్టేరు బ్రాంచ్ కార్యదర్శి పాల ప్రసాద్ కోరారు. శనివారం మార్టేరు బ్రాంచ్ సంఘ సమావేశం అధ్యక్షుడు కే. సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పాల ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ రూల్స్ వాలిడేషన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, వేతన సవరణ సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు 30 శాతం మధ్యంతర భృతి వెంటనే మంజూరు చేయాలని, కమ్యూటేషన్ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని కోరారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే, విమాన ప్రయాణ చార్జీల్లో రాయితీలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
కోశాధికారి చిర్ల సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు రెండు విడతల డీఆర్‌లు మంజూరు చేయడంతో పాటు, గత ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటంను 7 నుంచి 10 శాతానికి, 12 నుంచి 15 శాతానికి పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేట్ అధ్యక్షుడు పి. కేశవరెడ్డి మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని, పెండింగ్ డీఆర్‌లు, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
సమావేశంలో పి. రామచంద్రరావు, నందన్‌కుమార్, సుబ్రహ్మణ్యం, కే. లక్ష్మీనారాయణ, కే. నర్సిరెడ్డి, బి. శ్రీరామకృష్ణ, ఎస్. విశ్వనాథం, రామారెడ్డి, జైశ్రీకుమారి, పి. సువర్ణగౌరి, సుభాలక్ష్మి, వెంకటలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బరాయిశర్మ తదితరులు పాల్గొన్నారు.




