Achanta: పెదమల్లంలో తోడికోడళ్ల రసవత్తర పోరు
Achanta: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం ఎంపీటీసీ స్థానానికి ఒకే ఇంటి తోడికోడళ్లు బోడపాటి సుప్రియ (వైసీపీ), మంగాదేవి (జనసేన) నామినేషన్ వేశారు.
Achanta: పెదమల్లంలో తోడికోడళ్ల రసవత్తర పోరు
ఆచంట: ఆచంట మండలం పెదమల్లం గ్రామం ఎంపీటీసీ ఎన్నికల బరిలో ఆసక్తికర పరిణామంచోటుచేసుకుందిప్రధాన పార్టీల నుంచి ఇరువురు తోడుకోడళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఓకే ఇంటి తోడి కోడళ్లైన బోడపాటి సుప్రియ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన బోడపాటి మంగాదేవి పోటీకి సిద్ధమయ్యారు. ఇరువురూ ఆచంట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం తమ నామినేషన్లు దాఖలు చేశారు.
తోడుకోడళ్లయిన ఇరువురు అభ్యర్థులూ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుండడం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా తోడు కోడళ్ల పోటీ గురించేచర్చించుకుంటు
న్నారు. దీంతో పెదమల్లం ఎంపీటీసీ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల బరిలో నిలిచిన తోడికోడళ్ళు ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో .. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చేవరకు వరకూ వేచి చూడాలి మరి.




