Palakollu: పేద రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసిన వాకర్స్ క్లబ్
Palakollu: పాలకొల్లులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నలుగురు పేద రోగులకు రూ.30 వేల విలువైన మందులు పంపిణీ. సేవా కార్యక్రమాలను కొనియాడిన అధ్యక్షుడు సుధాకరరావు.
Palakollu: పేద రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసిన వాకర్స్ క్లబ్
పాలకొల్లు: పాలకొల్లు పట్టణం మరియు పరిసర గ్రామాలకు చెందిన నలుగురు పేద అనారోగ్య పీడితులకు వాకర్స్ క్లబ్ పాలకొల్లు తరపున అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు 30 వేల రూపాయల విలువైన మందులను శుక్రవారం ఉదయం కొత్త కుళాయి చెరువు వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ ఇబ్బందులు పడుతున్న సాటి మనిషికి సాయం అందించాలనే సంకల్పంతో వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యం లో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. క్లబ్ సెక్రటరీ షేక్ పీర్ సాహెబ్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో అందరూ తమ వంతు భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, జవ్వాజి కల్యాణ్, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మందులు అందుకున్న వారిలో పాలకొల్లు పట్టణం ఒకటవ వార్డు కు చెందిన వెంపటాపు మావుళ్ళు, నాగరాజు పేట కు చెందిన రాచర్ల రాజా, పాలకొల్లు గ్రామీణ గవరపేట కు చెందిన పెనుగొండ పాపారావు, బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బట్టేలంకకు చెందిన తోలేటి రామాంజనేయులు ఉన్నారు.




