Palakollu: ఎన్ఎస్ఎస్ డే: పాలకొల్లులో ట్రాఫిక్ పోలీసులకు ఘన సత్కారం
Palakollu: పాలకొల్లు ఏఎస్ఎన్ఎం జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా విధుల్లో సేవలందిస్తున్న ట్రాఫిక్ హోంగార్డులు, పోలీసు అధికారులను ఘనంగా సత్కరించారు.
Palakollu: ఎన్ఎస్ఎస్ డే: పాలకొల్లులో ట్రాఫిక్ పోలీసులకు ఘన సత్కారం
Palakollu: పాలకొల్లులో జాతీయ సేవా పథకం దినోత్సవ సందర్భంగా ఈరోజు స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాలకొల్లు పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణ విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది హోంగార్డులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వి.కిె మల్లేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె రజని కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. పృద్వి వి చ్చేశారు. వందేమాతరం గీతంతో సమావేశం ప్రారంభమైంది. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పూలమాల అలంకృతం చేశారు. ఎస్సై శ్రీ పృథ్వి సైబర్ నేరాలు గురించి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అనవసరమైనటువంటి లింకులు ఓపెన్ చేయకూడదని, క్రమశిక్షణతో మెలగాలని ఉద్బోధించారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కే రజిని కుమార్ మాట్లాడుతూ చట్టాలు అవగాహన గురించి విస్తృతమైనటువంటి అవగాహన కలగజేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ శివ సత్య రమణ కుమార్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ లో నిరంతరం ప్రజా క్షేమానికి పాటుపడే హోంగార్డ్స్ ను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల (ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల) సేవలను కూడా ఉపయోగించుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని ఎస్ఐ ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ శ్రీ బి సత్యనారాయణ, శ్రీ ఏ పెద్ద పాము, శ్రీ ఎం శ్రీను, శ్రీ ఎం సత్యనారాయణ, శ్రీ వైవీఎస్ నారాయణ, శ్రీ బి.శ్యామ్ కుమార్, శ్రీ కే సుబ్రహ్మణ్యం, శ్రీ ఎం ఎస్ ఎన్ వి సత్యనారాయణ లను , ట్రాఫిక్ ఏఎస్ఐ సీఎం ఉమామహేశ్వరరావు ను, ఏ ఎస్ ఐ శ్రీ ఎ కే రామయ్య ను సత్కరించారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కే రజిని కుమార్ ను, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి పృథ్వి గారిని ఘనంగా సత్కరించారు. మరో ముఖ్య తిధి ఎన్ఎస్ఎస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ వి దుర్గాప్రసాద్ ను, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వికేమల్లేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రమణ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన వందన సమర్పణ చేశారు.




