Palakollu: ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ భారీ ర్యాలీ!

Palakollu: పాలకొల్లులో రోటరీ క్లబ్ గుడాల హరిబాబు ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవ ర్యాలీ. పోలియో నిర్మూలనకు కృషి చేయాలని పిలుపు, పిల్లలకు చుక్కల పంపిణీ.

S VENKAT, PALAKOLLU
Published on: 24 Oct 2026 10:50 PM IST
Palakollu
X

Palakollu: ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ భారీ ర్యాలీ!

పాలకొల్లు: 24 10 26 తేదీలు పాలకొల్లు ఉల్లంపర్రు మాంటిస్సోరీ స్కూల్ వద్ద రోటరీ క్లబ్ అఫ్ పాలకొల్లు అధ్యక్షుడు గుడాల హరిబాబు ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవ అవగాహన మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గుడాల హరిబాబు మాట్లాడుతూ పోలియో వ్యాధిని నిర్మూలించుటలో రోటరీ క్లబ్ 40 సంవత్సరాలుగా ఎన లేని కృషి చేసిందని దీని ఫలితంగా చిన్నపిల్లల్లో అంగవైకల్యాన్ని నిర్మూలించి పోలియో రహిత దేశాలుగా నిలబడ్డాయని తెలిపారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ కమింగ్ గవర్నర్ డాక్టర్ ముచ్చర్ల సంజయ్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజంగా మారడానికి రోటరీ క్లబ్ చేసిన కృషిని వివరించారు. జిల్లా యూత్ రోటరీ అవార్డు షిప్ చైర్ మద్దాల వాసు మాట్లాడుతూ పోలియో వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దీనికి విద్యార్థి దశ నుండి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పోలియో ఫండ్ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ కు అందజేయాలని తెలిపారు. అవగాహన కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ మైగాపుల రాంబాబు. కోశాధికారి ఆరుమిల్లి సురేష్. ఫాస్ట్ ప్రెసిడెంట్ లు ఇమ్మిడి రాజేష్.రావాడ సతీష్. ముత్యాల శ్రీవత్సవప్రదీప్. కానూరి ప్రభాకర్ రావు. చిలుకూరి భిమన్న. వైస్ ప్రిన్సిపాల్ వసంతలక్ష్మి. ఏ ఎన్ ఎం భాగ్యలక్ష్మి. హెల్త్ అసిస్టెంట్ బి రామకృష్ణ. ఉపాధ్యాయులు. ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU