Palakollu: రోడ్డు ప్రమాదంలో కళాకారుడు వడ్లమాని హరికృష్ణ మృతి
Palakollu: పాలకొల్లు యల్లవాని గరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ కళాకారుడు, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి వడ్లమాని హరికృష్ణ మృతి చెందారు.
Palakollu: రోడ్డు ప్రమాదంలో కళాకారుడు వడ్లమాని హరికృష్ణ మృతి
Palakollu: పాలకొల్లు రూరల్ పంచాయతీ యల్లవాని గరువులో నివాసం ఉంటున్న కళాకారుడు, గాయకుడు, ఇండియన్ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి వడ్లమాని హరికృష్ణ 63 రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భీమవరం ఇంపీరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
ఆయనకు భార్య, సోదరులు ఉన్నారు ఇండియన్ బ్యాంక్ పాలకొల్లు, జిన్నూరు, వీరవాసరం, చెన్నైలో పనిచేసే స్వచ్ఛంద పదవి విరమణ చేశారు . గత ఏడాది ఆయన గుండే శస్త్ర చికిత్స చేయించుకున్నారు. శుక్రవారం అనారోగ్యంగా ఉండడంతో భార్య హరికృష్ణను తీసుకుని ద్విచక్ర వాహనం మీద వెళుతుండగా ఏళ్లవాని గరువు వద్ద పల్సర్ బండి పై వెళ్తున్న వ్యక్తి వీరిని ఢీ కొట్టారు.
తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందారు . ఆయన మృతి పట్ల పాలకొల్లు ప్రాంతానికి చెందిన పలువురు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఆయన భౌతికయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
హరికృష్ణ అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఏడు గంటలకు పాలకొల్లు హిందూ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.




