Palakollu: పాలకొల్లులో ఆపరేషన్ వికటించి పీహెచ్‌సీ నర్సు మృతి

Palakollu: పాలకొల్లులోని వివేక్ నర్సింగ్ హోమ్‌లో ఆపరేషన్ చేస్తుండగా సఖినేటిపల్లికి చెందిన మోరి పీహెచ్‌సీ నర్సు జి. మౌనిక (28) మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది.

S VENKAT, PALAKOLLU
Published on: 28 Sept 2026 7:15 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లులో ఆపరేషన్ వికటించి పీహెచ్‌సీ నర్సు మృతి

Palakollu: పాలకొల్లు లోని మఠం వీధిలో గల వివేక్ నర్సింగ్ హోమ్ అనే ప్రయివేటు ఆసుపత్రి లో శస్త్ర చికిత్స కోసం చేరిన యువతి ఆదివారం రాత్రి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గ్రామానికి చెందిన జి. మౌనిక ( 28 ) మోరి PHC లో నర్సుగా ఉద్యోగం చేస్తున్నారు.

ఆమె అనారోగ్యం తో చికిత్స కోసం పాలకొల్లు లోని ఓ ప్రయివేటు ఆసుపత్రి అయిన వివేక్ నర్సింగ్ హోమ్ లో గత ఆదివారం రాత్రి చేరారు. ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ధియేటర్ కు తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చిన తర్వాత ఆమె ఆందోళన చెంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

డాక్టర్ల నిర్లక్ష్యం వలనే నిండు ప్రాణం బలైంది అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగటంతో అసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటన తో స్పందించిన పాలకొల్లు పోలీసులు పరిస్థితిని అదుపు చేసి కుటుంబ సభ్యులను వారించి శాంతింపజేశారు. అనంతరం కుటుంబసభ్యులు మౌనిక పార్దివదేహాన్ని స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU