Palakollu: గాంధీ జయంతి వేడుకల్లో జర్నలిస్టుల డిమాండ్ల వినతిపత్రం

Palakollu: పాలకొల్లులో జర్నలిస్టుల జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి.

S VENKAT, PALAKOLLU
Published on: 2 Oct 2026 5:44 PM IST
Palakollu
X

Palakollu: గాంధీ జయంతి వేడుకల్లో జర్నలిస్టుల డిమాండ్ల వినతిపత్రం

పాలకొల్లు: జర్నలిస్టుల జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగాను మరియు గాంధీ జయంతి సందర్బంగాను పాలకొల్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నందు గాంధీజీ విగ్రహానికి జర్నలిస్టుల కోర్కెలతో కూడిన వినతి పత్రాన్ని పాలకొల్లు ప్రెస్ క్లబ్ సమర్పించారు.

జర్నలిస్ట్ సంఘాల నాయకులు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను ఇవ్వాలని, అర్హులైన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులు అందరికీ ఇన్సూరెన్స్ మరియు ప్రమాద బీమా పథకాలను వర్తింప చేయాలని కోరుతూ, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేసి తమ కోర్కెలు పరిశీలించి తక్షణమే నెరవేర్చే విధంగా కృషి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU