Palakollu: పాలకొల్లులో పాత ఎక్సైజ్ కేసుల ముద్దాయిలకు కౌన్సెలింగ్, బైండోవర్!
Palakollu: పాలకొల్లులో పాత ఎక్సైజ్ కేసుల ముద్దాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి రూ.1 లక్ష చొప్పున బైండోవర్ చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
Palakollu: పాలకొల్లులో పాత ఎక్సైజ్ కేసుల ముద్దాయిలకు కౌన్సెలింగ్, బైండోవర్!
పాలకొల్లు: ఈరోజు పాలకొల్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఎక్సైజ్ సీఐ మద్ది రామశేషయ్య గారి ఆధ్వర్యంలో గతంలో నకిలీ మద్యం (Spurious Liquor),గంజాయి (NDPS), సుంకం చెల్లించని మద్యం (NDPL), తదితర కేసుల్లో ఉన్న పాత ముద్దాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
తదుపరి మొత్తం ఏడుగురు(07) పాత ముద్దాయిలకు భవిష్యత్తులో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని సూచించారు. అనంతరం వారిని పాలకొల్లు మండల రెవెన్యూ అధికారి (MRO) వారి ఎదుట హాజరుపరిచి, ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున బైండోవర్ చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ మద్ది రామశేషయ్య తెలిపారు.
అక్రమ మద్యం, గంజాయి మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.




