Palakollu: బ్రాడీపేటలో గణేష్ ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ
Palakollu: పాలకొల్లు బ్రాడీపేటలో ఘనంగా గణేష్ అన్నప్రసాద వితరణ. హాజరైన తహసిల్దార్ దుర్గాకిషోర్, సీఐ రజినీకుమార్. నేడు గణేశుని నిమజ్జన ఏర్పాట్లు.
Palakollu: బ్రాడీపేటలో గణేష్ ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ
పాలకొల్లు: బ్రాడిపేటలో ఏర్పాటు చేసిన 62 అడుగుల గణేశుని నిమర్జనానికి నేడు భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక బ్రాడీపేట ఐదో వీధిలో గణేష్ నవరాత్రుల 70వ మహోత్సవం సందర్భంగా శనివారం ఉత్సవకమిటీ వారు ఏర్పాటుచేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ యడ్ల దుర్గాకిషోర్, పట్టణ సర్కిల్ ఇనస్పెక్టర్ కోలా రజినీకుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణేష్ కి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కొద్దిసేపు భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి ఉత్సవ కమిటీ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం గణేశునికి పూజా కార్యక్రమాలు జరిగినా అనంతరం అత్యంత వైభవంగా మేళతాళాలతో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వచ్చాక కమిటీ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు.
అన్నసమారాధన కార్యక్రమంలో అడబాల గ్రూప్స్ అధినేత అడబాల వెంకటరమణ, కమిటీ అధ్యక్షుడు పూడి దుర్గాప్రసాద్, కార్యదర్శి చందక మణికంఠ, నంద నాగరాజు, కోరాడ చిన్న, సంక్రాంతి దుర్గేష్, గడే సూర్యప్రకాష్, మొయ్యి సతీష్, శంకరాపు శ్రీనివాస్, ఎలకల రంగా, బోణం అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.




