Palakollu: పాలకొల్లులో బయోమైనింగ్ ద్వారా చెత్త తొలగింపు: కమిషనర్ కిరణ్
Palakollu: పాలకొల్లులోని సూర్యతేజ్ నగర్, ఎడ్ల బజార్ డంపింగ్ యార్డుల్లో 50 ఏళ్ల లెగసీ వేస్ట్‌ను బయోమైనింగ్ ద్వారా తొలగిస్తున్నట్లు కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు.
Palakollu: పాలకొల్లులో బయోమైనింగ్ ద్వారా చెత్త తొలగింపు: కమిషనర్ కిరణ్
పశ్చిమ గోదావరి జిల్లా: పాలకొల్లు పట్టణంలో ప్రతిరోజు ఇల్లు , షాపుల నుండి డోర్ కలెక్షన్ ద్వారా 42 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించబడుతుందనీ,42 మెట్రిక్ టన్నుల చెత్తను పాలకొల్లు పురపాలక సంఘమునకు చెందిన సూర్య తేజ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ కు, ఎడ్ల బజార్ లోని డంపింగ్ యార్డ్ కు సుమారు 50 సంవత్సరముల అంతకుముందు నుండే తరలించబడుచున్నదనీ.
మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కృషితో గడచిన 2 సంవత్సరముల కాలములో రెండు డంపింగ్ యార్డ్ నందు లెగసి వేస్ట్ ని బయోమైనింగ్ పద్ధతి ద్వారా చెత్తను తొలగించుటకు చర్యలు తీసుకున్నట్లు సదరు పనులను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, భీమవరం వారి పర్యవేక్షణలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి గ్రాంట్ నిధులతో పనులు జరుగుచున్నవనీ, మున్సిపల్ కమిషనర్ దొడ్డ కిరణ్ కుమార్ తెలియజేశారు,




