Palakollu: అంగన్వాడీల సేవలు అభినందనీయం: పాలకొల్లులో ఘన సన్మానం

Palakollu: పాలకొల్లు మెప్మా భవనంలో ‘అంగన్ మిలన్ సేవా’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు.

S VENKAT, PALAKOLLU
Published on: 29 Sept 2026 3:55 PM IST
Palakollu
X

Palakollu: అంగన్వాడీల సేవలు అభినందనీయం: పాలకొల్లులో ఘన సన్మానం

పాలకొల్లు: చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలు, తల్లుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమని నాయకులు అన్నారు.

దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న “అంగన్ మిలన్ సేవా” కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వెనుకనున్న మెప్మా భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేశారు. వారి సేవలను గుర్తిస్తూ వారిని సన్మానించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధి, పౌష్టికాహారంపై అవగాహన, తల్లుల ఆరోగ్య పరిరక్షణలో వారు పోషిస్తున్న పాత్రను కొనియాడారు.

కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉన్నమట్ల కబర్ది, అల్లూరి పద్మవర్మ, జక్కంపూడి కుమార్, వేరుకొండ దుర్గాప్రసాద్,గవర పవన్ నాయుడు, మల్లవోలు సురేష్, చెరుకూరి శ్రీనివాసరావు, నాళం బాబీ, పాటపత్రి గోపాలకృష్ణంరాజు, చందాని లక్ష్మీనారాయణ అంగన్వాడీ అధికారులు ఇందిరా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU