Kothapalem: కొత్తపాలెంలో వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్ టీడీపీలో చేరిన 100 మంది నేతలు
Kothapalem: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెంలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్. మాజీ సర్పంచ్ లోకం నాగలక్ష్మి సహా 100 మంది నాయకులు టీడీపీలో చేరారు.
Kothapalem: కొత్తపాలెంలో వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్ టీడీపీలో చేరిన 100 మంది నేతలు
Kothapalem: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీలో వందమంది చేరారు. కొత్తపాలెం గ్రామ మాజీ సర్పంచ్ లోకం నాగలక్ష్మి, ఆమె భర్త లోకం వెంకటేశ్వరరావు (నాని) మంగళవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
నరసాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తపాలెం గ్రామానికి చెందిన లోకం నాగలక్ష్మి, లోకం వెంకటేశ్వరరావు టీడీపీలో చేరడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నాయకులు వారికి అభినందనలు తెలియజేశారు.




