Iragavaram: మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఎన్నిక!
Iragavaram: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండల యూపీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన సభ్యులు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను కలిశారు.
Iragavaram: మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఎన్నిక!
Iragavaram: ఇరగవరం మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ (యూపీఎఫ్) నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బిషప్ ఎ.ఆగమనరావు, అధ్యక్ష,కార్యదర్శులుగా పి. యేసుబాబు, ఎం రాజు, ఉపాధ్యక్షులుగా కె. రాజారావు, సహాయ కార్యదర్శిగా యస్.డేవిడ్ రాజు, కోశాధికారిగా యన్.ధనుంజిరావు, సహాయ కోశాధికారిగా కె. సమాధానరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా వి. రమేష్, కె.రాజ్ సుధీర్, సి.హెచ్ కిషోర్కుమార్ ,రాజ మోహన్ రావు, యు.చిట్టి బాబు, వి. సైమన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ను సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. క్రైస్తవుల సమస్య లను పరిష్కరించాలని కోరారు. క్రైస్తవుల కొరకు తప్పక కృషి చేసి అండగా నిలబడతారు అని తెలిపారు .




