Penugonda: పెనుగొండలో కూటమి ప్రచార జోరు: ఇంటింటికీ నేతలు
Penugonda: పెనుగొండ మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి చలుమూరు చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేసి, ఎంపీటీసీ అభ్యర్థి సురేష్‌బాబుతో కలిసి చిన్నవారిపాలెంలో ప్రచారం చేపట్టారు.
Penugonda: పెనుగొండలో కూటమి ప్రచార జోరు: ఇంటింటికీ నేతలు
పెనుగొండ: పెనుగొండ మండలంలో కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జడ్పీటీసీ అభ్యర్థి చలుమూరు చంద్రశేఖర్ గురువారం నామినేషన్ దాఖలు చేయగా, ఎంపీటీసీ అభ్యర్థి రొక్కాల సురేష్‌బాబు ( జెడ్పిటిసి అభ్యర్థి చలుమూరి శేఖర్)తో కలిసి చిన్నవారిపాలెంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.
కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించిన ఇరువురు అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. నామినేషన్ కార్యక్రమంతో పాటు క్షేత్రస్థాయి ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పెనుగొండ మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.




