Penumantra: నీటమునిగిన నత్తారామేశ్వరం శ్రీ రామేశ్వర స్వామి ఆలయం

Penumantra: పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలోకి చేరిన గోస్తనీ మురుగు నీరు. శాశ్వత రక్షణ గోడ నిర్మించాలని అధికారులకు భక్తుల విజ్ఞప్తి.

E.ABRAHAM, ACHANTA
Published on: 4 Nov 2026 10:10 PM IST
Penumantra
X

Penumantra: నీటమునిగిన నత్తారామేశ్వరం శ్రీ రామేశ్వర స్వామి ఆలయం

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం నీటమునిగి దర్శనమిస్తున్న దృశ్యం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. గోస్తనీ మురుగు నీరు ఆలయం చుట్టూ చేరి లోపలికి ప్రవేశిస్తుండటంతో ఆలయ పరిరక్షణపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయం చుట్టూ మురుగు నీరు లోపలికి రాకుండా శాశ్వత రక్షణ గోడ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఆలయాన్ని నీటి ముంపు నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పురాతన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భక్తులు పేర్కొంటున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA