Poduru: వద్దిపర్రులో నక్కల డ్రైన్ ఉధృతి పరిశీలించిన ఆర్డీవో దాసిరాజు!
Poduru: పోడూరు మండలంలో నర్సాపురం ఆర్డీవో దాసిరాజు, తహసీల్దార్ మౌలానా ఫాజిల్ పర్యటన వద్దిపర్రు నక్కల డ్రైన్ పరిశీలన, పెనుమదంలో కూలిన ఇంటి బాధితులకు పునరావాసం.
Poduru: వద్దిపర్రులో నక్కల డ్రైన్ ఉధృతి పరిశీలించిన ఆర్డీవో దాసిరాజు!
పోడూరు: పోడూరు భారీ వర్షాలు నేపథ్యంలో వద్దిపర్రు గ్రామంలో నక్కల డ్రైన్ ఉధృతి ని గురువారం నర్సాపురం ఆర్డీవో దాసిరాజు పరిశీలించారు. డ్రైన్ లో నీటి ప్రహవాహానికి అడ్డుగా అక్కడక్కడా పేరుకుపోయిన గుర్రపు డెక్కను, తూడును వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని ఆయన డ్రైన్స్ శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు మండలంలో పరిస్థితిని స్థానిక తాసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ ను అడిగి తెలుసుకున్నారు.
తాసిల్దార్ మౌలానా ఫాజిల్ సుడిగాలి పర్యటన:
భారీ వర్షాల నేపథ్యంలో పోడూరు తాసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వద్దిపర్రులో నక్కల డ్రైన్ ను ఆయన పరిశీలించారు. డ్రైన్ లో నీటి ప్రవాహం ఉదృతంగా ఉండటంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని తాసిల్దార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
వేడంగి గ్రామంలో అరటి తోటలను, నిమ్మ తోటలను తాసిల్దార్ పరిశీలించారు. భారీ వర్షాల ధాటికి పెనుమదంలో గోడలు కూలిపోయిన కంజులూరి రామకృష్ణ ఇంటిని కూడా ఆయన పరిశీలించారు. ఇంట్లో వాళ్ళని సురక్ష ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తాసిల్దార్ స్థానిక విలేకరులకు తెలిపారు.




