Narsapuram: నర్సాపురం జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా నాగ వెంకటలక్ష్మి నామినేషన్
Narsapuram: నర్సాపురం జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెస్సీ చదివిన కూనపరెడ్డి నాగ వెంకటలక్ష్మి నామినేషన్. భీమవరంలో ఆర్ఓకు పత్రాల అందజేత.
Narsapuram: నర్సాపురం జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా నాగ వెంకటలక్ష్మి నామినేషన్
నర్సాపురం: నర్సాపురం పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో విద్యావంతులు రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ముందుకు రావడం విశేషం. నర్సాపురం జడ్పీటీసీ రేసులో ఎంఎస్సీ చదివిన కూనపరెడ్డి నాగ వెంకటలక్ష్మి నరసాపురం మండలం జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
భీమవరంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్, రైతు, ప్రజా సమస్యల పోరాట నాయకులు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు కుమార్తె అయిన నాగ వెంకటలక్ష్మి ఈ ఎన్నికల బరిలో నిలిచారు. తండ్రి ఆశయ సాధనకు కృషి చేయాలనే లక్ష్యం తో జెడ్ పి టి సి గా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
ఎమ్మెస్సీ (M.Sc) పూర్తి చేశానని , రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఒక ఉన్నతమైన, సేవాభావం ఉన్న కుటుంబం నుండి వచ్చిన తాను రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు తమ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని , తన తండ్రి స్పూర్తి దాయకంగా నరసాపురం మండల జెడ్ పి టి సి స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేస్తున్నాని, ప్రజలు ఆశీర్దిస్తే ప్రజా సేవలో స్థిరపడతానని కూనపరెడ్డి నాగ వెంకటలక్ష్మి తెలిపారు.




