Palakollu: నరసాపురం - విశాఖ డైలీ రైలు పునరుద్ధరించాలని వినతి!
Palakollu: నరసాపురం-విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు DRUCC మెంబర్ జక్కంపూడి కుమార్ వినతి పత్రం. పూర్తి వివరాలు ఇక్కడ
Palakollu: నరసాపురం - విశాఖ డైలీ రైలు పునరుద్ధరించాలని వినతి!
Palakollu: South Coast Railway DRUCC మెంబెర్ జక్కంపూడి కుమార్ ఈరోజు భీమవరంలోని ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని వ్యక్తిగతంగా కలిసి నరసాపురం నుంచి వైజాగ్ కు రెగ్యులర్ గా డైలీ ట్రైన్ నడపాలని కోరుతూ వినతి పత్రం (మెమొరండం) అందచేసారు.
వినతి పత్రంలో నరసాపురం, పాలకొల్లు, కోనసీమ ప్రాంత ప్రజలు విశాఖపట్నం వెళ్లడానికి ప్రత్యక్ష డైలీ రైలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్లు గౌరవప్రదంగా ప్రయాణించలేకపోతున్నారని KGH మరియు ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లే రోగులు, నిడదవోలు,
భీమవరం వద్ద రైళ్లు మారాల్సి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నరసాపురం, పాలకొల్లు, కోనసీమ నుండి ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, డైలీ బిజినెస్ చేసేవారు, ఆక్వా రైతులు, విశాఖపట్నం లోని పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఉద్యోగులు డైలీ రైలు లేక ఇబ్బంది పడుతున్నారని అలాగే భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ,
మరియు నరసాపురం - అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, పాలకొల్లు క్షీరారామం, పంచారామాలు, మావటూరమ్మ, ఫక్కీలు, కేసర రామలింగేశ్వర, పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి, ద్రాక్షారామం - మాణిక్యాంబ, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం - సింహాద్రి అప్పన్న, అరకు లోయ వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కలిపే టూరిజం సర్క్యూట్ గా
ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని, రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందని వినతి పత్రంలో పేర్కొనడం జరిగిందని అయన అన్నారు. కావున నరసాపురం - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును తక్షణమే డైలీ రైలుగా పునరుద్ధరించాలని కోరడమైనదని ఈ కార్యక్రమంలో జక్కంపూడి కుమార్* - South Coast Railway DRUCC Member, పాలకొల్లు, కొల్లి కొండ ప్రసాద్ - భీమవరం, కాశీరాజు - భీమవరం, చిన్నబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.




