Narasapuram: నరసాపురం మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు!
Narasapuram: నరసాపురం మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 36 వార్డులకు 71 పోలింగ్ కేంద్రాలు, ప్రశాంత పోలింగ్ కోసం 677 మంది సిబ్బందిని నియమించారు.
Narasapuram: నరసాపురం మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు!
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా, 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 10 సమస్యాత్మక, మరో 10 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 46,996 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో 22,389 మంది పురుషులు, 24,606 మంది మహిళలు, ఒకరు ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 677 మంది సిబ్బందిని నియమించారు. నామినేషన్ల స్వీకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో 10 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో తొమ్మిది కౌంటర్లను కౌన్సిలర్ అభ్యర్థులకు, ఒక కౌంటర్ను చైర్పర్సన్ అభ్యర్థులకు కేటాయించారు.
ఇక పోలింగ్ సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను నరసాపురంలోని వై ఎన్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.




