Narasapuram: నరసాపురంలో కొత్త పాలనకు శ్రీకారం.. పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొత్తపల్లి శైలజ జానకీరామ్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం; ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 23 Nov 2026 5:42 PM IST
Narasapuram
X

Narasapuram: నరసాపురంలో కొత్త పాలనకు శ్రీకారం.. పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, సర్వమత పెద్దలతో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయించారు.

అనంతరం ప్రిసైడింగ్ అబ్జర్వర్, ఎన్నికల అధికారి నవ్య ఐఏఎస్, రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సమక్షంలో నూతన చైర్‌పర్సన్ కొత్తపల్లి శైలజ జానకీరామ్‌తో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మున్సిపల్ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. పండుగ వాతావరణంలో సాగిన ఈ వేడుకతో నరసాపురం మున్సిపాలిటీలో కొత్త పాలనకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రభుత్వ సలహాదారు, ఎంఎస్ షరీఫ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM